AP Police Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లో భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించి సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలను చదవండి.
ఏపీలో ఇప్పటికే 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించడం జరిగినది వాటికి సంబంధించి ఈవెంట్స్ మరియు ఫైనల్ పరీక్షలు జరగాల్సి ఉంది కోర్టు కేసులు కారణంగా అవి వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారని తాజా సమాచారం.
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
AP Police Recruitment 2024 Update:
ఆంధ్రప్రదేశ్ డీజీపీ తిరుమల రావు గారు రాయలసీమ ఎస్పీలతో 13 జూలై 2024 సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగా పోలీస్ ఖాళీలను మూడు లేదా నాలుగు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించడం జరిగింది.

పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదొక శుభవార్తని చెప్పవచ్చు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని భర్తీ చేయనున్నారు అనే స్పష్టత ఇవ్వలేదు కానీ ఖాళీలన్నిటిని భర్తీ చేస్తామని చెప్పడం జరిగినది అలాగే అర్హులైన పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామని కూడా వెల్లడించడం జరిగింది.
AP Police Recruitment 2024 Board:
ఈ ఖాళీలు విడుదల చేస్తే మనకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే APSLPRB చైర్మన్ గా S.V రాజశేఖర్ బాబు గారిని నియమించడం జరిగినది. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇటీవల వెల్లడించారు.

AP Police Recruitment 2024 Vacancies:
ఒకవేళ పోలీస్ ఉద్యోగాలు విడుదలయితే ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారని చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25 వేల ఖాళీలు ఉన్నట్టు సమాచారం అందులో గత ప్రభుత్వం 6100 పోస్టుల నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే కానీ ఆ నోటిఫికేషన్ పూర్తి చేయలేదు ఇప్పుడు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. గత నోటిఫికేషన్ ని రద్దు చేసి లేదా ఆ నోటిఫికేషన్ ని కొనసాగించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారా అనే సమాచారం తెలియాల్సి ఉంది.
AP Police Recruitment 2024 అర్హత:
- కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది.
- ఎస్సై పోస్టులకు డిగ్రీ అర్హత ఉన్నవారు మాత్రమే అర్హులు.
AP Police Recruitment 2024 Apply:
ఒకవేళ మనకు నోటిఫికేషన్ విడుదల అయితే ఆ పోస్టులను దరఖాస్తు చేసుకోవడానికి మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ చూడడానికి గల లింకును క్రింద ఇవ్వడం జరిగినది.
Note:ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు https://slprb.ap.gov.in ను సందర్శించాలి. మాకు ఎటువంటి సమాచారం తెలిసిన అప్డేట్ ఇస్తాము.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
