APPSC Web Note Update:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతంలో విడుదల చేసిన 8 ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్ నోట్ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్ 27 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తారని వెల్లడించారు. మొత్తం 8 రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లకు ఏప్రిల్ 27 వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం అవుతాయి పూర్తి వివరాలు పరిశీలిస్తే.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోలీస్ కమిషనరేట్ లో భారీగా జాబ్స్
APPSC Exam Dates 2025:
మొత్తం ఎనిమిది పోస్టులకు ఏ తేదీలలో పరీక్ష నిర్వహిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.
- అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరీక్షను 28, 29 ఏప్రిల్ 2025న నిర్వహిస్తారు.
- లైబ్రేరియన్ వైద్య శాఖలో పరీక్షలు 27 మరియు 28 ఏప్రిల్ నిర్వహిస్తారు.
- అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28 మరియు 30 ఏప్రిల్ పరీక్ష ఉంటుంది.
- అసిస్టెంట్ డైరెక్టర్ సంక్షేమ శాఖ 27 మరియు 28 ఏప్రిల్ పరీక్ష నిర్వహిస్తారు.
- అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు 28 మరియు 29 ఏప్రిల్ పరీక్ష నిర్వహిస్తారు.
- అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు 28 ఏప్రిల్ పరీక్ష ఉంటుంది.
- అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28 మరియు 29 ఏప్రిల్ పరీక్ష నిర్వహిస్తారు.
- ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28 మరియు 30 ఏప్రిల్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పరీక్షలను కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే నిర్వహిస్తారు ఆ జిల్లాల వివరాలు చూసుకుంటే విశాఖపట్నం, కృష్ణ, చిత్తూర్ మరియు అనంతపూర్.
ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “APPSC 8 ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు విడుదల | APPSC Latest News Today”