AP Contract Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో Contract Jobs భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత ఫార్మసీ ఆఫీసర్ అనే పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే జీతం 32,670/- లభిస్తుంది సొంత జిల్లాలో పనిచేసుకునే అవకాశం నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు జనవరి 17 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం కడప వారు విడుదల చేశారు ఇందులో ఫార్మసీ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ చేసిన అభ్యర్థులు అర్హులు.
🔥గ్రామ సచివాలయం ఉద్యోగుల సమాచారం
పోస్టుల వివరాలు:
ఈ Contract Jobs నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 32,670/- లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయాలంటే ఓసి అభ్యర్థులు 500 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగులు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥AP అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత లోని మార్కుల మెరిట్ మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
పోస్టింగ్ వివరాలు:
ఈ ఉద్యోగం మనకు లభిస్తే జోన్ ఫోర్ పరిధిలో కడప, చిత్తూర్, కర్నూల్, అనంతపూర్ పాత జిల్లాల పరిధిలో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి క్రింద తెలిపిన చిరునామాకు పంపించండి దరఖాస్తు చివరి తేదీ జనవరి 17.
దరఖాస్తు చిరునామా: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం, జోన్ 4, కడప.
ఇటువంటి AP Contract Jobs సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.