SRTRI Free Training 2025: శుభవార్త..ఉచిత భోజనం, శిక్షణ, హాస్టల్ వసతి తో పాటు ఉద్యోగం
SRTRI Free Training 2025:
పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వారు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ(SRTRI) ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యాలతో ఉద్యోగం కల్పిస్తున్నారు. దీనిని భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించాలి మరియు శిక్షణ ఇవ్వాలి అని భావించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దరఖాస్తు చేయుటకు 29 మేబి2025 చివరి తేదీ.
ఇటువంటి SRTRI ఉచిత శిక్షణ కార్యక్రమం లాంటి సమాచారాలు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥కానిస్టేబుల్ హాల్టికెట్స్ విడుదల చేశారు
ఇందులో ఏ కోర్సులు ఉంటాయి:
అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తారు ఇందులో వివిధ రకాల కోర్సులు క్రింద తెలిపిన విధంగా అందిస్తారు.
- కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్స్
- అకౌంట్ అసిస్టెంట్ (Tally)
- ఆటోమొబైల్ టు వీలర్ సర్వీస్
- DTP కోర్స్
పై తెలిపిన కోర్సులకు 10 వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హతలు ఉన్నవారు అర్హులు మీ అర్హత బట్టి మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. కోర్సు వ్యవధి మూడు నెలలు ఉంటుంది. పై తెలిపిన కోర్సులు ఆసక్తి ఉన్నవారు క్రింద తెలిపిన చిరునామా నందు సంప్రదించగలరు. దరఖాస్తు చేయుటకు 29 మే 2025 చివరి తేదీ కావున ఆలోపు అభ్యర్థులు ఒక సమయం వినియోగించుకోండి.
చిరునామా:
స్వామియే రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలల్ పూర్, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, 508284.
వివరాలు కొరకు సంప్రదించండి: 9133908000, 9133908222, 91339081111
ఇటువంటి SRTRI ఉచిత శిక్షణ ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.