AP DSC Hall Tickets 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా డీఎస్సీ 2025 నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జూన్ 6 వ తేదీ నుండి మొదలు అవుతాయి ఈ నేపధ్యంలో హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు షెడ్యూల్ వివరాలు కోసం దరఖాస్తు చేసుకున్న 3,53,598 అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ. డీఎస్సీ హాల్ టికెట్స్ మే 30 వ తేదీ నుండి అందుబాటులో వస్తాయి వచ్చిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP DSC హాల్ టికెట్ సమాచారం ఈరోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్.
🔥ఏపీ లో ఉచిత స్కూటీ ఇచ్చే పథకం
How to Download AP DSC Hall Tickets 2025..?
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్స్ రేపటి నుండి అనగా మే 30 వ తేదీ ఏ క్షణం అయినా విడుదల చేస్తారు విడుదల చేసిన వెంటనే డౌన్లోడ్ చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://apdsc.apcfss.in/ ఓపెన్ చెయ్యండి.
- అందులో మీకు Hall Tickets డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి.
- అక్కడ మీకు రిజిస్టర్ ID తో లాగిన్ చేయవలసి ఉంటుంది మీ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి.
- అక్కడ మీకు మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల వివరాలు పక్కనే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అందులో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
- డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్ష కొరకు సిద్ధం అవ్వండి.
AP DSC Exam Schedule..?
ఇప్పటివరకు షెడ్యూల్ జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తారని ప్రకటించారు ఏ పరీక్షలు ఏ సమయంలో ఉంటాయో తెలియజేయలేదు ముందుగా స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించి జూన్ 17 వ తేదీ తర్వాత SGT పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం రావడం జరిగింది పూర్తి అధికారిక షెడ్యూల్ రేపు విడుదల చూస్తారు అందులో మనకు సమాచారం లభిస్తుంది. ఒక్కో సెషన్ లో 20,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రోజుకు 40 వేల మంది పరీక్షలు రాసే సామర్థ్యం ఉన్న కారణంగా పరీక్షలు త్వరగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి ఏపీ డీఎస్సీ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP DSC Hall Tickets 2025: ఏపీ డీఎస్సీ హాల్ టికెట్స్ డౌన్లోడ్, షెడ్యూల్ వివరాలు”