NICL Recruitment 2025:
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) వారు పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేవలం డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరలిస్ట్ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి మొత్తం 266 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో పరీక్ష మరియు సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అర్హత సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NICL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥తల్లికి వందనం పథకం లిస్ట్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 12 జూన్ 2025 నుండి 3 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. NICL ఉద్యోగులకు ప్రిలిమ్స్ పరీక్షలు 20 జూలై 2025 నుండి నిర్వహించే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్షలు 31 ఆగస్టు 2025 నిర్వహించే అవకాశం ఉన్నట్టు నోటిఫికేషన్లు తెలియజేశారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) వారు విడుదల చేశారు ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించి మొత్తం 266 ఖాళీలు ఉన్నాయి ఇందులో జనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
వయస్సు:
ఈ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీస వయసు 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
NICL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥ఏపీ అటవీ శాఖలో భారీ నోటిఫికేషన్
ఎంపిక విధానం:
ఇందులో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 90 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సి, ఎస్టీ మరియు దివ్యాంగులు కేవలం 250 ఫీజు చెల్లిస్తే చాలు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NPCIL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
Administrative officer job
NICL Administrative officer job