AP EAMCET 2025 Counselling:
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులకు శుభవార్త ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు ఈ షెడ్యూల్ ప్రకారం జూలై 7 వ తేదీ నుండి జూలై 16 వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, సీట్ అలాట్మెంట్, అడ్మిషన్ ఇచ్చి కాలేజీలో చేరే అవకాశం కల్పిస్తారు పూర్తి షెడ్యూల్ విడుదల కావడం జరిగింది అన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని విద్యార్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
AP EAMCET 2025 Counselling Dates:
ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి పూర్తి కౌన్సిలింగ్ తేదీల వివరాలు పరిశీలిస్తే.
- కౌన్సిలింగ్ నోటిఫికేషన్ 4 జూలై 2025 విడుదల చేశారు.
- రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లించడానికి 7 జూలై 2025 నుండి 16 జూలై 2025 వరకు అవకాశం ఉంది.
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఏడు జూలై నుండి 17 జూలై వరకు చేస్తారు.
- వెబ్ ఆప్షన్స్ 10 జూలై నుండి 18 జూలై వరకు ఎంటర్ చేయాలి.
- వెబ్ ఆప్షన్ మార్చుకునే అవకాశం 19 జూలై ఇస్తారు.
- సీట్ అలాట్మెంట్ 22 జూలై 2025 ఇవ్వడం జరుగుతుంది.
- సీటు పొందిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చే తేదీ 23 జూలై.
- మొదటి సంవత్సరం విద్యార్థులకు 4 ఆగస్టు 2025 క్లాసులు ప్రారంభించాలి.
🔥తల్లికి వందనం పథకం వాయిదా కొత్త తేదీ
AP EAMCET 2025 Counselling Certificates:
పైన తెలిపిన షెడ్యూల్ అధికారికంగా విడుదల చేశారు అలాగే అభ్యర్థులు ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి కౌన్సిలింగ్ కు కావలసిన సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోండి.
- రిజిస్ట్రేషన్ సమయంలో ఆన్లైన్ చెల్లించిన ఫీజు Reciept ఉండాలి.
- ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్
- ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్
- పదవ తరగతి సర్టిఫికెట్
- ఇంటర్ మార్క్స్ సర్టిఫికెట్
- ఇంటర్మీడియట్ TC
- కుల దృవీకరణ పత్రం
- ఇన్కమ్ సర్టిఫికెట్
- ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్స్
పైన తెలిపిన సర్టిఫికెట్స్ అన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు మరియు షెడ్యూల్ జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తారు ఆ సమాచారం తెలుసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి AP EAMCET 2025 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.