AP New Pensions:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ శుభవార్త రావడం జరిగింది. రాజధాని అమరావతి గ్రామాల్లో భూమిలేని పేదలకు పెన్షన్ పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2015 లో జరిపిన ఇంటింటి సర్వే ఆధారంగా రాజధాని వల్ల జీవనోపాధి కోల్పోయిన 1575 కుటుంబాలకు అప్పట్లో 5000 పెన్షన్ ఇచ్చేవారు గత ప్రభుత్వం దీనిని రద్దు చేయడం జరిగింది వారికి తిరిగి ప్రతినెల కుటుంబంలో ఒకరికి ఐదువేల పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం 524 కోట్లు విడుదల చేస్తూ పురపాలక ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
🔥ఎయిమ్స్ లో భారీ నోటిఫికేషన్ విడుదల
ఇక నుండి అమరావతి లోని 1575 కుటుంబాలకు ప్రతినెల 5000 Pension చెల్లిస్తారు. అప్పట్లో చాలామంది రైతులు వారి భూములు రాజధానికి ఇవ్వడం వల్ల జీవనోపాధి కోల్పోయారు అటువంటి వారికి గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే వారికి అమరావతిలో స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం త్వరలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించిన సమాచారం లభించిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది.
ఇటువంటి AP Pension సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.