AP NTR Vaidya Seva Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP NTR వైద్య సేవ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥APSRTC లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా సొంత జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రిలో పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి.
విద్యా అర్హతలు:
దరఖాస్తు చేయడానికి బీఎస్సీ కంప్యూటర్ లేదా BCA లేదా బీకాం కంప్యూటర్స్ లేదా బీటెక్ చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు లేదు ఏదైనా డిగ్రీ చేసి PGDCA సర్టిఫికెట్ కోర్సు చేసిన వారు కూడా అర్హులు. కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి.
జీతం & వయస్సు:
ఈ AP NTR వైద్య సేవ పథకం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు మీరు ఎంపిక జీతం 18500 లభిస్తుంది. దరఖాస్తు చేయుటకు వయస్సు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 500 ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS మరియు దివ్యాంగులు 350 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, GGH, శ్రీకాకుళం అనే పేరు పైన DD తీయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 4 ఆగస్టు 2025 నుండి 20 ఆగస్టు 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎంపిక విధానం:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అవ్వాలంటే మొదట స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి శ్రీకాకుళం గవర్నమెంట్ ఆసుపత్రి, సూపరిండెంట్ వారికి మీ దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి AP NTR వైద్య సేవ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.