SBI Clerk Jobs 2025:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్లర్క్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 5180 ఖాళీలు భర్తీ చేస్తున్నారు కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. SBI లో చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కావున అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో జైలు వార్డెన్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విడుదల చేయడం జరిగింది ఇందులో జూనియర్ అసోసియేట్ (క్లర్క్ – కస్టమర్ సపోర్ట్) పోస్టులు ఉన్నాయి మొత్తం 5180 ఖాళీలు భర్తీ చేస్తున్నారు మన సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం.
వయస్సు & జీతం:
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది. మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 45 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన విద్యా మండలి నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥ఏపీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఆరు ఆగస్టు 2025 నుండి 26 ఆగస్టు 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
దరఖాస్తు ఫీజు:
మీరు ఈ SBI జూనియర్ అసోసియేట్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఫీజు 750 రూపాయలు చెల్లించాలి ఎస్సి, ఎస్టీ, మహిళలు మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే ప్రధాన పరీక్ష మరియు భాషా ప్రావిణ్య పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “SBI లో 5180 క్లర్క్ ఉద్యోగాలు భర్తీ”