DSSSB Teacher Jobs Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) వారు ప్రైమరీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో మొత్తం 1180 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైతే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు మున్సిపల్ పాఠశాలలో పని చేయవలసి ఉంటుంది. చాలా అరుదుగా ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసి ప్రయత్నించండి.
ఇటువంటి DSSSB ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందాలంటే పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపి అటవీ శాఖలో కొత్త ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 17 సెప్టెంబర్ 2025 నుండి 16 అక్టోబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) వారు విడుదల చేశారు ఇందులో ప్రైమరీ టీచర్ 1180 ఖాళీలు ఉన్నాయి అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 1055 మరియు మున్సిపల్ పాఠశాలలో 125 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
మీరు ఈ పోస్టులకు అర్హులు కావాలంటే ఇంటర్ చేసిన తర్వాత DED కోర్సు పూర్తి చేసి ఉండాలి అలాగే CTET తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉన్న వారికి మాత్రమే దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే పదవ తరగతిలో హిందీ లేదా ఉర్దూ ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి.
జీతం వివరాలు:
ప్రైమరీ టీచర్ పోస్టులకు మీరు ఎంపికైతే అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 47,000/- వరకు రావడం జరుగుతుంది.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి DSSSB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.