KVS, NVS Notification 2025:
నిరుద్యోగులు అందరూ ఎదురు చూస్తున్న భారీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయిన కేంద్రీయ విద్యాలయ సమితి (KVS) మరియు నవోదయ విద్యాలయ సమితి (NVS) పాఠశాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం ఖాళీల వివరాలు చూసుకుంటే 14,833 ఉన్నాయి. భర్తీకి 14 నవంబర్ 2025 నుండి దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు. టీచర్ పోస్టులు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ ఇందులో నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా భారీగా ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి KVS, NVS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 14 నవంబర్ 2025 నుండి 4 డిసెంబర్ 2025 వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయం మరియు నవోదయ విద్యాలయం వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 14,833 పోస్టులు ఉన్నాయి భర్తీ చేసే పోస్టులు ప్రైమరీ టీచర్స్, PGT, TGT, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, లైబ్రరియన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రైమరీ టీచర్స్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్లేటర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఇందులో ఉన్నాయి మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాలో పనిచేసే అవకాశం ఇస్తారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు పోస్టులు అనుసరించి 10, 12 మరియు డిగ్రీ, PG, బీటెక్ అర్హత ఉండాలి టీచర్ ఉద్యోగాలకు DED, BED, MED అర్హత ఉన్నవారు అర్హులు కొన్ని పోస్టులకు CTET లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా పోస్టులు అనుసరించి 50 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి ఫీజు నిర్ణయించడం జరిగింది. కనీసం500/- గరిష్టంగా ఫీజు2300/- గా ఉంది మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తారో చూసుకొని ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
ఒకటే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ నిర్వహిస్తారు అవసరం అయితే. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి కొన్ని పోస్టులకు అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
KVS, NVS పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది వెబ్సైట్ https://www.cbse.gov.in/ లేదా https://navodaya.gov.in లో 4 డిసెంబర్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఇటువంటి KVS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “KVS మరియు NVS లో 14,833 పోస్టులు భర్తీ | KVS Notification 2025 | NVS Notification 2025”