AIASL Jobs 2026:
ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) లో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ (PSA) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి ఫీజు మరియు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీ వివరాలు మెయిల్ ద్వారా పంపించి దరఖాస్తు చేయవచ్చు తిరుపతిలో ఉద్యోగం చేసే మంచి అవకాశం నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AIASL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥NPCIL లో భారీగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 13 జనవరి 2026 చివరి తేదీ అభ్యర్థులు అర్హత ఉంటే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIASL వారు విడుదల చేశారు ఇందులో తిరుపతి ఎయిర్పోర్ట్ నందు ఖాళీగా ఉన్న ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ పోస్టులు భర్తీ చేస్తారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

చేయవలసిన పని:
- టికెట్ మరియు రిజర్వేషన్ కౌంటర్లో పని చేయాలి.
- ప్యాసింజర్ బ్యాగేజ్ చెకింగ్ కౌంటర్ నందు పనిచేయాలి.
- డాక్యుమెంట్స్ పరిశీలన కేంద్రంలో పనిచేయాలి.
- ప్యాసింజర్ యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి.
- కస్టమర్ యొక్క ఫిర్యాదులు స్వీకరించే కౌంటర్ లో పనిచేయాలి.
- రోజు మొత్తంలో మూడు షిఫ్టులు ఉంటాయి ఏ షిఫ్ట్ ఇచ్చిన పని చేసే విధంగా ఉండాలి.
జీతం వివరాలు:
మొదట 11 నెలలు ట్రైనింగ్ ఉంటుంది ఈ సమయంలో జీతం 10,000/- ఇస్తారు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత జీతం పెంచడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని officer.hsr@aiasl.in కు మెయిల్ చేయండి 13 జనవరి 2026 చివరి తేదీ ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా మీ వివరాలు పైన తెలిపిన మెయిల్ కు పంపించండి.
ఇటువంటి AIASL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AIASL Jobs 2026: తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాలు భర్తీ ”