AIIMS Mangalagiri Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) మంగళగిరి నుండి నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు సొంత రాష్ట్రంలో వివిధ ప్రోగ్రామర్, లా ఆఫీసర్, బయో మెడికల్ ఇంజనీర్, సానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, కన్సల్టెంట్ ఖాళీలు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం కింద వివరించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.
ఇటువంటి AIIMS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIIMS మంగళగిరి వారు విడుదల చేశారు ఇందులో ప్రోగ్రామర్, లా ఆఫీసర్, బయో మెడికల్ ఇంజనీర్, సానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, కన్సల్టెంట్ అనే నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం ఇస్తున్నారు.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు కావున పూర్తి నోటిఫికేషన్ పరిశీలించి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు పోస్టులు అనుసరించి వయస్సు మారుతూ ఉంటుంది రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వైయస్ సూడలింపు ఇవ్వడం జరిగింది.
దరఖాస్తు ఫీజు:
ఇందులో ఇచ్చిన కొన్ని పోస్టులకు ఎటువంటి ఫీజు లేదు కొన్ని పోస్టులకు మాత్రం వెయ్యి రూపాయలు మరికొన్ని పోస్టులకు 1500 ఫీజు నిర్ణయించడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 1 నవంబర్ 2025 నుండి 30 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఈ తేదీలలో ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయాలి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత హార్డ్ కాపీ 10 డిసెంబర్ 2025 లోపు ఎయిమ్స్ మంగళగిరి వారికి పంపించాలి.
ఎంపిక విధానం:
పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు ఆన్లైన్లో చేయండి.
ఇటువంటి AIIMS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP AIIMS లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ | AIIMS Mangalagiri Recruitment 2025”