AP DSC 2025 New Response Sheets Released, Cut Off Marks @apdsc.apcfss.in

AP DSC 2025 New Response Sheets:

ఆంధ్రప్రదేశ్ లో DSC పరీక్షలు ముగిసిన సంగతి మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం అన్ని పరీక్షలకు సంబంధించి Response Sheets విడుదల చేస్తున్నారు తాజాగా కొన్ని పరీక్షలకు సంబంధించి విడుదల చేశారు మొత్తంగా 75 షిఫ్టుల రెస్పాన్స్ షీట్స్ మరియు కీ అధికారికంగా https://apdsc.apcfss.in వచ్చేసాయి అభ్యర్థులు మీ మార్కులు ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC 2025 Response Sheets Download:

  • అభ్యర్థుల ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • ఓపెన్ చేసిన వెంటనే పైన Candidate Login మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ user id మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
  • ఓపెన్ అవ్వగానే మీకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు రాసిన పరీక్షల షీట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అక్కడ మీరు ఏ సమాధానం ఇచ్చారు దానికి ఏ సమాధానం సరైనది కనిపిస్తుంది దాని ద్వారా మీ మార్కులు పరిశీలించుకోండి.
  • అభ్యర్థులకు ముఖ్య గమనిక ఈ మార్కులు ఫైనల్ కాదు పరీక్షలు వివిధ షిఫ్టుల్లో జరిగిన నేపథ్యంలో నార్మలైజేషన్ ఉంటుంది.
  • నార్మలైజేషన్ లో మీకు మార్కులు పెరగవచ్చు మరియు తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు కావున అప్పటివరకు వేచి చూడాలి.

AP DSC 2025 Cut Off Marks:

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ కట్ ఆఫ్ మార్కుల గురించి అభ్యర్థులు అడుగుతున్నారు కట్ ఆఫ్ మార్కులు ప్రస్తుతం అంచనా వేయలేము ఎందుకనగా పరీక్షలు వేర్వేరు షిఫ్టుల్లో జరగడం జరిగింది కావున నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ మార్కులు అంచనా వేయవచ్చు కానీ ప్రస్తుతం 65+ మార్కులు సాధించిన SGT అభ్యర్థులు పాజిటివ్ గా ఉండవచ్చు మిగిలిన వారికి కూడా అంటే దీనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా అవకాశం ఉంది కానీ కొన్ని రోజులు వేచి చూడాలి.

AP DSC 2025 New Response Sheets

NOTE: కట్ ఆఫ్ మార్కులు కొన్ని కేటగిరి అనగా రిజర్వేషన్ కలిగిన వారికి చాలా తక్కువ మార్కులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కావున అభ్యర్థులు అధికారికంగా విడుదల చేసిన ఫలితాలు వరకు వేచి చూడాలి. పోస్టులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు తక్కువ మార్కులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కావున ఎటువంటి కంగారు పడకుండా చివరి ఫలితం వరకు వేచి ఉండండి మరింత సమాచారం కొరకు కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Join WhatsApp Group 

ఇటువంటి ఏపీ డీఎస్సీ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!