AP Govt Work From Home Jobs:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరికీ ఉపయోగపడేలా ఇంటి నుండి పని (కౌశలం) సర్వే ప్రారంభించడం జరిగింది. ఇందులో నిరుద్యోగులకు సంబంధించి వివరాలు తీసుకొని వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వారి ద్వారా ఇంటి నుండి పని కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది దానిలో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ వివరాలు తీసుకుంటున్నారు వీటికి ఎవరు అర్హులు అనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Work From Home Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి.
🔥ఏపి డీఎస్సీ కాల్ లెటర్స్ విడుదల చేశారు
కౌశలం సర్వే వివరాలు:
ప్రభుత్వం ఇంటి నుండి పని కల్పించడానికి కౌశలం సర్వే ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కావున మీ దగ్గరలోని సచివాలయం సందర్శించి అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోవాలి.
వయస్సు & జీతం:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. దరఖాస్తు చేసి మనకు ఈ ఉద్యోగం లభిస్తే 13 వేల నుండి 45 వేల వరకు జీతం రావడం జరుగుతుంది.
దరఖాస్తు కు కావలసిన వివరాలు:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించిన తర్వాత వారు మొదట మీ ఆధార్ నంబర్ కు అనుసంధానం అయిన మొబైల్ నంబర్ ఓటిపి రావడం జరుగుతుంది అది ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ విద్యా అర్హత సర్టిఫికెట్స్ మరియు స్కిల్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
విద్యా అర్హత:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న Work From Home (Kaushalam) సర్వే విద్యార్హత చూసుకుంటే
- డిప్లొమా
- డిగ్రీ
- బీటెక్
- PG
- ITI
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మీ సచివాలయం పరిధిలో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో మనకు ఉద్యోగాలు ప్రభుత్వం ద్వారా కల్పిస్తారు.
పరీక్ష సిలబస్:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రైవేట్ సంస్థలు పరీక్ష నిర్వహిస్తారు అందులో అర్థమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు రావడం జరుగుతుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
మీరు గ్రామ సచివాలయం వెళ్లి మీ పేరు Work From Home సర్వేలో ఉందా పరిశీలించండి ఒకవేళ లేకపోతే మీ ఆధార్ నంబర్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ పేరు ఉంటే సచివాలయ సిబ్బంది మీ వివరాలు తీసుకొని దరఖాస్తు చేస్తారు.
ఇటువంటి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Govt Work From Home Jobs | AP ప్రభుత్వ ఇంటి నుండి పని సర్వే వివరాలు”