AP Job Calendar 2024:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఏపీలో జాబ్ క్యాలెండర్ పైన నూతన సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు చూడండి.
ఏపీలో నిరుద్యోగులు అందరూ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నారు ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఉంటుందని శాసనమండలిలో నారా లోకేష్ గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు వెల్లడించడం జరిగినది.
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
AP Job Calendar 2024 Details:
ఈరోజు అనగా 24 జూలై శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ నారా లోకేష్ గారు మరియు పయ్యావుల కేశవ్ గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు ఏపీలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము మరియు ఆ ఖాళీలను ఏ నెలలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుంది మరియు ఏ తేదీన ఏ పరీక్షలు నిర్వహిస్తామనేది కూడా ఆ జాబ్ క్యాలెండర్ లో తెలియజేస్తామని వెల్లడించారు.
ఈ వార్త ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అందరికీ ఒక శుభవార్త అని మనం భావించవచ్చు ప్రభుత్వ శాఖలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు లక్షల వరకు ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అన్ని శాఖల్లో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు నిలబడే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉంటుందని మంత్రిగారు తెలియజేశారు.
కావున ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారందరూ తప్పకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారు వచ్చే సంవత్సరం నుండి మనకు ఈ జాబ్ క్యాలెండర్ లో విడుదల చేసి ఈ ఉద్యోగాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల
ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ
పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
AP Job Calendar 2024 Police Jobs:
ఈరోజు శాసనమండలిలో హోం శాఖ మంత్రి అనిత గారు పోలీస్ నియామకాల గురించి వివరించారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో 750 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే 6100 కానీస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ని కూడా కోర్టు కేసును పరిష్కరించి ఆ నియామకాలు కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు మరియు కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చెయ్యనున్నారు.
AP Job Calendar 2024 APPSC Jobs:
ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ద్వారా చాలా రకాల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది మనకు రేపు పాఠశాలల్లో మరియు కళాశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్న అసెంబ్లీలో రానుంది వాటికి మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు సమాధానం ఇవ్వనున్నారు అలాగే ఏపీపీఎస్సీ ఉద్యోగ భర్తీల సమాచారం కూడా తెలియజేయనున్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది వాటిని కూడా భర్తీ చేయాలి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు