AP Jobs Calendar 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు ఏర్పాటు చేసింది జనవరి 12 న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 866 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఇందులో అత్యధికంగా అటవీ శాఖలో 814 పోస్టులు భర్తీ చేస్తారు మొత్తం 18 నోటిఫికేషన్ ద్వారా ఈ జాబ్ క్యాలెండర్ ఉంటుంది.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
AP Jobs Calendar 2025 వివరాలు:
ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం 18 నోటిఫికేషన్స్ ద్వారా 866 ఖాళీలు భర్తీ చేస్తారు పోస్టుల వారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.
- అటవీ సెక్షన్ ఆఫీసర్ -100 పోస్టులు
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 691
- డ్రాప్స్ మెన్ గ్రేడ్- 13
- అటవీ శాఖ గుమస్తా -10
- మున్సిపల్ శాఖలో- 11
- అగ్రికల్చర్ ఆఫీసర్- 10
- జిల్లా సైనిక్ ఆఫీసర్- 7
- గ్రంథాలయ పాలకులు – 2
- హార్టికల్చర్ ఆఫీసర్ -2
- అసిస్టెంట్ ఇన్స్పెక్టర్- 3
- టెక్నికల్ అసిస్టెంట్- 4
🔥AP ఉపాధి ఆఫీస్ ద్వారా 1100 పోస్టులు
విద్యా అర్హతలు:
దరఖాస్తు చేయడానికి 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఇందులో ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
జీతం:
ఈ AP Jobs Calendar 2025 లో మనకు ఉద్యోగం వస్తే కనీసం 25,000/- గరిష్టంగా 60 వేల వరకు జీతం ఉంటాయి ఇతర అలవెన్స్ అన్ని లభిస్తాయి ఇవి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.
🔥కరెంట్ ఆఫీసుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ
జాబ్ క్యాలెండర్ వివరాలు:
ఈ జాబ్ క్యాలెండర్ 12 జనవరి 20 25 న విడుదల చేస్తారు ఇందులో ఏ తేదీన నోటిఫికేషన్ ఉంటుంది మరియు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు అనే పూర్తి వివరాలు ఇస్తారు ఈ నోటిఫికేషన్లు త్వరలో పూర్తి కాబోయే ఎస్సీ వర్గీకరణ అనంతరం ఉంటాయి.
దరఖాస్తు విధానం:
శాఖల వారీగా వివిధ వెబ్సైట్ ల నందు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు పూర్తి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే సమాచారం జనవరి 12 తెలుస్తుంది నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP Jobs Calendar 2025 సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ జాబ్స్ క్యాలెండర్ 2025 విడుదల | AP Jobs Calendar 2025 | APPSC Job Calendar Out”