AP NHM Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లో వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NHM) లో భాగంగా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ మొత్తం 18 పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NHM ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥కరెంట్ ఆఫీసుల్లో 475 ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 23 జనవరి 2025 నుండి 3 ఫిబ్రవరి 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ:
ఈ నోటిఫికేషన్ పశ్చిమ గోదావరి జిల్లా వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NHM) లో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥రైల్వేలో 1104 ఉద్యోగాలు భర్తీ
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- ఫార్మసిస్ట్ -07
- ల్యాబ్ టెక్నీషియన్-01
- డేటా ఎంట్రీ ఆపరేటర్-06
- అటెండర్-04
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు క్రింది తెలిపిన విద్యా అర్హత ఉండాలి.
- ఫార్మసిస్ట్ – బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ
- ల్యాబ్ టెక్నీషియన్ – బీఎస్సీ MLT లేదా DMLT
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – డిగ్రీ
- అటెండర్ – 10th పాస్ చాలు
🔥CBI లో డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు అందరు అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి. చెల్లించడానికి ముందుగా బ్యాంకుకు వెళ్లి District medical and health officer, ఏలూరు పేరు పైన చెల్లించాలి.
🔥AP UCIL నోటిఫికేషన్ విడుదల చేశారు
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాధా పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత లోని మార్కులు మరియు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపిన తర్వాత నోటిఫికేషన్ లో తెలిపిన పత్రాలు అన్ని తీసుకొని వెళ్లి 3 ఫిబ్రవరి 205 సాయంత్రం 5 గంటలలోపు District medical and health officer, ఏలూరు వారికి సమర్పించండి.
ఇటువంటి NHM ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “AP లో NHM ఉద్యోగాలు భర్తీ | AP NHM Recruitment 2025 | Latest Jobs in Telugu”