AP NHM Recruitment 2025 :
ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 56 పోస్టులు ఉన్నాయి. వివిధ పోస్టులకు సంబంధించి జీతం 15,000/- నుండి 61,960/- వరకు రావడం జరుగుతుంది. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ తెలుసుకుని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP NHM ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పోవడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 9 అక్టోబర్ 2025 నుండి 22 అక్టోబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (AP NHM) ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, లాజిస్టిక్ కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, సానిటరీ అటెండర్, సెక్యూరిటీ గార్డ్ ఇతర పోస్టులు ఉన్నాయి మొత్తం 56 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
జీతం:
పోస్టులు వారిగా జీతం 15,000/- నుండి 61,960/- వరకు రావడం జరుగుతుంది ఇతర ఇటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో పనిచేయాలి.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, MBBS అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు కొన్ని పోస్టులకు అనుభవం అడుగుతున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు DD రూపంలో District Medical & Health Officer వారికి చెల్లించాలి ఎవరికి ఎటువంటి ఫీజు మినహాయింపు లేదు.
ఎంపిక విధానం:
ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హతలోని మార్కులు మరియు అనుభవం ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని 22 అక్టోబర్ 2025 లోపు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని DM & HO, Chittoor వారికి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ఇటువంటి AP NHM ఉద్యోగ సమాచారం రోజు పొందటానికి మా వెబ్సైట్ సందర్శించండి.