AP Nirudyoga Bruthi 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది నిరుద్యోగ భృతి పథకం ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు అందిస్తారు వీటికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇటువంటి AP Nirudyoga Bruthi 2025 సంబంధించి సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥అన్నదాత సుఖీభవ స్టేటస్ చూసుకోండి
AP Nirudyoga Bruthi 2025 Update:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి పథకం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు.
- ఈ సంవత్సరం చివరి నాటికి ఈ పథకానికి సంబంధించి అన్ని మార్గదర్శకాలు విడుదల చేసి పథకం అమలు చేస్తామని తెలియజేశారు.
- నిరుద్యోగ భృతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలు అనుసరించి ఎంపిక చేస్తామని తెలియజేశారు.
- నెలకు 3000 రూపాయలు అందిస్తామని అలాగే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.
ఇతర ముఖ్యమైన వివరాలు ప్రకటించారు:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని దానికి అనుగుణంగా నూతన సంస్థలు ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
- ఎప్పటికీ సుమారుగా 5 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు.
- మెగా డీఎస్సీ ద్వారా 16,500 ఉద్యోగాలు భర్తీ మరో నెలలో పూర్తి చేసి వారికి పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు.
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం చివరి నాటికి మీ నిరుద్యోగ భృతి పథకం అమలు చేసే అవకాశం ఉంది.
ఇటువంటి నిరుద్యోగ భృతి పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Nirudyoga Bruthi 2025: ప్రతి నెల 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి పథకం అమలు”