AP Police Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త Police శాఖలో 11,639 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది. వివిధ క్యాడర్లలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టుల భర్తీ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడం జరిగింది పూర్తి సమాచారం పరిశీలిస్తే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వారు హైకోర్టులో పిల్ వేయడం జరిగింది.
🔥పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
మొత్తం పోలీసు శాఖలో RTI ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఖాళీల వివరాలు చూసుకుంటే 13 శాఖల్లో 19,999 ఉన్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం జరిగింది ఆ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇదే వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రజాహిత వ్యాజ్యాలు బుధవారం హైకోర్టులో విచారణకు రావడం జరిగింది ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివిధ కేడర్ల కింద 11639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రాధాన్య క్రమంలో భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డిజిపి ఈ ఏడాది సెప్టెంబర్ 29 న హోం శాఖ ముఖ్య కార్యదర్శి కి లేఖ రాసారన్నారు దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది.
AP Police Notification 2026:
ఈ వివరాలు అన్నీ విన్న హైకోర్టు ఆరు వారాల్లో దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే త్వరలో పోలీసు శాఖలో ఆంధ్రప్రదేశ్లో 11,639 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది కావున నిరుద్యోగులు పోలీసు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారు వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారు అలాగే పోలీసు శాఖలో ఖాళీలు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది.

పోలీస్ శాఖలో భర్తీ చేసే పోస్టులు చూసుకుంటే కానిస్టేబుల్, SI, వివిధ ఆఫీసు ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, ఫైర్ శాఖ ఖాళీలు, కమ్యూనికేషన్, టెక్నికల్, డ్రైవర్ ఇలాంటి చాలా రకాల పోస్టులు ఉన్నాయి కావున అభ్యర్థులు సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి.
ఇటువంటి AP Police శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Police Jobs 2026: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో 11,639 పోస్టులు భర్తీ ”