AP Police Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాలు, ఎంపిక జాబితా విడుదల చేసి మూడు నెలలు పూర్తి అవుతున్న అభ్యర్థులకు ఇప్పటివరకు శిక్షణ ప్రారంభించకపోవడంతో ఎంపిక అయిన వారు అందరూ ఆందోళన చెందుతున్నారు మొత్తం 6100 పోస్టులకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికీ ఎంపిక చేశారు ఆగస్టు 1 న ఫలితాలు విడుదల చేసినా హోం మంత్రి అనిత గారు మూడు నెలలు దాటినా కూడా శిక్షణ ప్రారంభం కాకపోవడంతో చాలామంది అభ్యర్థులు శిక్షణ కోసం ఎదురుచూస్తున్నారు వారందరికీ ప్రస్తుతం గుడ్ న్యూస్ రావడం జరిగింది.
🔥300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ
రాష్ట్రంలో 6100 Police కానిస్టేబుల్ ఖాళీలకు 2022 నవంబర్ నెలలో వైకాపా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియలను నిలిపివేశారు అభ్యర్థులు ఎన్నిసార్లు అడిగిన పట్టించుకోలేదు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత న్యాయపరమైన అంశాలు అన్ని పూర్తి చేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగులకు సంబంధించి ఎంపిక జాబితా విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఆ పోస్టులకు 6014 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు శిక్షణ వెంటనే ప్రారంభించాల్సి ఉన్న మూడు నెలలుగా ఆలస్యం చేస్తున్నారు వాటికి సంబంధించి ప్రస్తుతం తాజా సమాచారం రావడం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
AP Police Jobs Training:
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ డిసెంబర్ రెండవ వారం నుండి ప్రారంభిస్తారని శిక్షణ విభాగం డీఐజీ సత్య ఏసు బాబు ప్రకటించారు కావున ఇది అభ్యర్థులకు భారీ శుభవార్త ఈ శిక్షణ పూర్తి అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో 11500 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

810 మంది సాంకేతిక కోర్సులు చేసిన అభ్యర్థులు ప్రస్తుతం ఎంపికైన జాబితాలో ఉన్నారు వారిలో బీటెక్, ఎంటెక్, BCA వంటి సాంకేతిక కోర్సులు చేసిన పట్టభద్రులు ఎక్కువగా కనిపిస్తున్నారు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 4051 మంది ఉన్నారు ఇలా ఉన్నత విద్య అభ్యసించిన వారు ప్రస్తుతం ఎంపికైన జాబితాలో కనిపిస్తున్నారు దీనికి ముఖ్య కారణం రాష్ట్రంలో చాలా రోజులుగా ప్రభుత్వ నోటిఫికేషన్లు ఆలస్యం అవ్వడమే ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని వారు కోరుకుంటున్నారు.
ఇటువంటి AP Police ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Police Jobs: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ 6100 పోస్టులకు సంబంధించి గుడ్ న్యూస్”