AP Rural Development Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ అభివృద్ధి (Rural Development) శాఖ ఆధ్వర్యంలో స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వారు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో మొత్తం 170 పోస్టులు ఉన్నాయి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Rural Development శాఖ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మీరు దరఖాస్తు చేయడానికి 7 జూలై 2025 సాయంత్రం ఐదు గంటల నుండి 18 జూలై 2025 రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ గ్రామీణ అభివృద్ధి (Rural Development) శాఖ ఆధ్వర్యంలో స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వారు విడుదల చేశారు ఇందులో 170 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ఒక సంవత్సరానికి కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు ఆ కాంట్రాక్ట్ అనేది ప్రతి సంవత్సరం పొడిగిస్తారు.
జీతం & విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి విద్య అర్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం ప్రతి నెల 25,520/- లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
- ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా క్రింద తెలిపిన విధంగా ఎంపిక చేస్తారు.
- పదవ తరగతి మార్కులకు 10 మార్కులు ఇస్తారు మీకు వచ్చిన మార్పుల ఆధారంగా వీటిని కేటాయిస్తారు.
- ఇంటర్ మార్కులకు 10 మార్కులు కేటాయిస్తారు మీకు వచ్చిన గ్రేడ్ పాయింట్లు లేదా పర్సంటేజ్ పరిగణంలో తీసుకుంటారు.
- డిగ్రీ విద్య అర్హతలు మీకు వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా 30 మార్కులు కేటాయిస్తారు.
- కంప్యూటర్ పరిజ్ఞానానికి ఐదు మార్కులు ఇస్తారు.
- ఏదైనా అనుభవం ఉంటే 15 మార్కులు ఇస్తారు.
- మీకు డిగ్రీ పూర్తి అయిన సంవత్సరం ఆధారంగా సంవత్సరానికి 0.5 మార్కులు చొప్పున గరిష్టంగా ఐదు మార్కులు కేటాయిస్తారు.
- పై తెలిపిన విధంగా మొత్తం 75 మార్కులకు ఎంపిక ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
- 25 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో మంచి ప్రతిభ చూపిస్తే వారిని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా చెల్లించడానికి అవకాశం కల్పించారు.
వయస్సు:
గ్రామీణ అభివృద్ధి సంస్థ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సి, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్లీన్ చేయడం జరిగింది అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Official Website Here
ఇటువంటి AP Rural Development సంస్థ ఉద్యోగ సమాచారం రోజుకు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ గ్రామీణ అభివృధి శాఖ జాబ్స్ | AP Rural Development Jobs 2025 | Assistant Manager Jobs in Stree Nidhi Cooperative Federation”