AP Social Counsellor Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖ వారు Social Counsellor పోస్ట్ కు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు మొదటి నెల నుండి జీతం 35 వేల రావడం జరుగుతుంది. 18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి సోషల్ కౌన్సిలర్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఒకటి ఫిబ్రవరి 2025 నుండి 15 ఫిబ్రవరి 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కడప జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో Social Counsellor అనే పోస్టు కేవలం మహిళలకు మాత్రమే ఇస్తున్నారు.
🔥గ్రామీణ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి మాస్టర్ డిగ్రీ సైకాలజీ లేదా సోషల్ వర్క్ నందు చేసిన వారు అర్హులు. కంప్యూటర్ వాడడం మరియు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
🔥AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 35 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం మీ విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥పోస్టల్ శాఖలో గ్రూప్ C ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు ఎటువంటి ఫీజు లేదు అర్హత ఉన్న అభ్యర్థులు https://kadapa.ap.gov.in వెబ్సైట్ నందు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు 15 ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు చిరునామా: జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అధికారి కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప
ఇటువంటి Social Counsellor పోస్టు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.