AP Technical Assistant Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం కల్పిస్తున్నారు మొత్తం 13 పోస్టులు ఇందులో ఉన్నాయి ఇవి జోనల్ వారీగా భర్తీ చేస్తారు కానీ సొంత జిల్లాలో పనిచేసే అవకాశం లభిస్తుంది వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు కలిగిన వారు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Technical Assistant ఉద్యోగాలు రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥భారీగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 18 సెప్టెంబర్ 2025 నుండి 8 అక్టోబర్ 2025 వరకు అవకాశం కల్పించారు కావున అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అటవీ శాఖ వారు APPSC ద్వారా విడుదల చేశారు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులు ఉన్నాయి జోనల్ వారీగా ఖాళీలు వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు సివిల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి లేదా ఈ విభాగంలో ITI పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
APPSC ద్వారా రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి. అందరూ అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి ఎవరికి ఎటువంటి మినహాయింపు లేదు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు 8 అక్టోబర్ 2025 లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Technical Assistant ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి

1 thought on “AP లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP Technical Assistant Jobs 2025 | AP Government Jobs 2025”