AP Welfare Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 43 ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు గరిష్టంగా జీతం 40,970/- లభిస్తుంది నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా భర్తీ చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Welfare శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు వాట్సాప్ లో రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ కోర్టు ఉద్యోగాల పరీక్ష తేదీలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 8 జూలై 2025 నుండి 15 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కర్నూల్ జిల్లా వారు విడుదల చేశారు ఇందులో కర్నూల్ మెడికల్ కాలేజీ నందు ఖాళీగా ఉన్న పోస్టులకు Health Medical & Family Welfare డిపార్ట్మెంట్ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ఒకసారి చూసుకుంటే.
- ఫిజియోథెరపిస్ట్ రెండు పోస్టులు
- స్పీచ్ తెరపిస్ట్ రెండు పోస్టులు
- టెక్నీషియన్ 8 పోస్టులు
- జనరల్ డ్యూటీ అటెండర్ 8 పోస్టులు
- ఆడియో మెట్రి టెక్నీషియన్ 01 పోస్టు
- MNO 11 పోస్టులు
- FNO 11 పోస్టులు
విద్యా అర్హత:
సంక్షేమ శాఖ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే అర్హత 10th/ ఇంటర్/ డిగ్రీ/ డిప్లొమా సంబంధిత విభాగంలో ఉన్నవారు అర్హులు.
🔥10th అర్హత తో అటెండర్ ఉద్యోగాలు
జీతం వివరాలు:
పోస్టులు వారిగా జీతం క్రింద తెలిపిన విధంగా రావడం జరుగుతుంది.
- ఫిజియోథెరపిస్ట్ 35,570
- స్పీచ్ తెరపిస్ట్ 40,970
- టెక్నీషియన్ 32,670
- జనరల్ డ్యూటీ 15,000
- ఆడియో మెట్రి టెక్నీషియన్ 32,670
- MNO 15,000
- FNO 15,000
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OC అభ్యర్థులు 250 ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 200 ఫీజు. DD ద్వారా కర్నూల్ మెడికల్ కాలేజీ, ప్రిన్సిపల్ పేరు పైన చెల్లించాలి.
ఎంపిక విధానం:
ఎటువంటి తాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యార్హత మార్కులు మరియు అనుభవం ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
వయస్సు:
AP Welfare డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు కింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వారికి మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి AP Welfare శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.