DEO, Store Keeper Jobs:
బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) వారు భారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), స్టోర్ కీపర్, టెక్నీషియన్, ఇంజనీరింగ్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మొత్తం 407 పోస్టులు ఉన్నాయి. కేవలం డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి DEO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ 11 ఫిబ్రవరి 2025న విడుదల కావడం జరిగింది దరఖాస్తు చేయుటకు 24 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIIMS, జమ్మూ వారికోసం కాంట్రాక్ట్ విధానంలో బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 407 వివిధ DEO, స్టోర్ కీపర్, టెక్నీషియన్, ఇంజనీరింగ్, మొత్తం నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥AP లో భారీగా ఔట్ సోర్సింగ్ జాబ్స్
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే విద్యా అర్హత పోస్టుల వారీగా 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ITI అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలను దరఖాస్తు చేయండి.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే పోస్టులు అనుసరించి జీతం 19,000/- నుండి 67,000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥ఇంటర్ అర్హత తో సచివాలయం జాబ్స్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు 590/- చెల్లించాలి SC, ST, PWD, EWS అభ్యర్థులు 295/- ఫీజు. ఆఫ్లైన్ విధానం లో ఫీజు DD తీయాలి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, నోయిడా పేరు పైన తీయాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన పత్రాలు అన్ని అప్లికేషన్ ఫారం తో పాటు కింద తెలిపిన చిరునామాకు పంపించండి చివరి తేదీ 24 ఫిబ్రవరి.
కావాల్సిన పత్రాలు:
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
- కుల ధ్రువీకరణ పత్రం
- పాన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
దరఖాస్తు చిరునామా: బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, BECIL భవన్, సెక్టార్ 62, నోయిడా, UP, Pincode – 201307
ఇటువంటి DEO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.