Free Scooty 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత స్కూటీ ఇచ్చే పథకం సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలిస్తే కళాశాలలో విద్య అభ్యసిస్తున్న, స్వయం ఉపాధిలో జీవనం సాగిస్తున్న దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీ వాహనాలను ఇవ్వాలని వాళ్లకు ప్రోత్సాహకం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు నియోజకవర్గానికి 10 చొప్పున వాహనాలు ఇవ్వాలని గత నెలలో ప్రభుత్వం ఆమోదిస్తూ తొలివిడతలు 50 శాతం పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దివ్యాంగుల దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు అని వారు వేచి చూస్తున్నారు.
ఇటువంటి AP Free Scooty 2025 పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో వీరికి 15 వేలు ఇచ్చే కొత్త పతాకం
Free Scooty Scheme Qualification:
ఉచిత త్రిచక్ర స్కూటీ ఇవ్వాలంటే కింద తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
- డిగ్రీ చదువుకున్న వారు అలాగే విద్యార్థులు కూడా అర్హులే.
- స్వయం ఉపాధి రంగంలో స్థిరపడి ఏడాది పైగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి.
- 18 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు.
ఎవరికి వాహనాలు ఇస్తారు పూర్తి వివరాలు..?
ఉమ్మడి జిల్లాలో 2023 సంవత్సరంలో భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు వైకాపా పాలనలో నియోజకవర్గానికి 10 చొప్పున లబ్ధిదారులకు అందించారు మిగిలిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాటికి కాలం చెల్లింది మరోసారి కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని అర్హులను గుర్తించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కూటమి ప్రభుత్వం కూడా 2025 సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గానికి 10 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు వీటిలో 50 శాతం మహిళలకు అందజేస్తారు యూనిట్ విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుంది ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని విభిన్న ప్రతిభావంతులు శాఖ అధికారులు తెలియజేశారు.
ఇటువంటి Free Scooty Scheme సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
ఉచిత స్కూటీ పథకం