Free Seat in Private School:
చాలామంది తల్లిదండ్రులకు మంచి ప్రైవేటు పాఠశాలలో చదివించాలని ఉంటుంది కానీ డబ్బులు లేని కారణంగా వెనకడుగు వేస్తుంటారు అటువంటి వారికి శుభవార్త రావడం జరిగింది Private School లో ఉచితంగా చదువుకునే మంచి అవకాశం సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చదివించవచ్చు కానీ విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 12 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో కొన్ని సీట్లు ఉచితంగా కేటాయించాలి వాటికి సంబంధించి ప్రస్తుతం అవకాశం రావడం జరిగింది.
ఇటువంటి Private School సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రేషన్ కార్డు ఉన్న వారికి ముఖ్య గమనిక
AP Private School Admissions:
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో మండల విద్యాశాఖ అధికారులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు ప్రస్తుతం కడప జిల్లా అధికారి వీటికి సంబంధించి వివరాలు వెల్లడించారు ఒకటవ తరగతిలో పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదవాలనుకుంటే వాటికి సంబంధించి అడ్మిషన్స్ జరుగుతున్నాయి పిల్లలకు కనీసం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉచిత సీటు కొరకు అర్హులు ఎవరు:
వీటికి దరఖాస్తు చేయాలంటే అనాధ పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు ఓసి కుటుంబాలకు చెందిన వారికి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.2 రెండు లక్షలు అలాగే పట్టణాల్లో 1.4 లక్షలు మించకుండా ఉన్నవారు అర్హులు.
దరఖాస్తు చేయడానికి మండల విద్యాశాఖ అధికారులను లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు 15 మే వరకు అవకాశం ఉంది అర్హులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ , తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం ద్వారా దరఖాస్తు చేయండి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.