Grama Sachivalayam Rationalization: గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది రేషనలైజేషన్

Grama Sachivalayam Rationalization:

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని సచివాలయాల్లో ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా Grama Sachivalayam సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా… చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల 4 నుంచి 6 మంది సచివాలయాలో పనిచేస్తున్నారు. రేషనలైజేషన్‌లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్‌గా వీరిని విభజించాలనేది ప్రతిపాదన.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥APPSC 8 నోటిఫికేషన్ల సమాచారం

How to Rationalize Grama Sachivalayam:

  • మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు.
  • అలాగే వార్డు సెక్రటేరియట్‌లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.
  • టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు.
  • టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.
  • 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు.
  • 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు.
  • 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు.

🔥పోలీస్ కమిషనరేట్ లో భారీగా జాబ్స్ 

Grama Sachivalayam Staff Details:

పైన తెలిపిన విధంగా రేషనలైజేషన్ చేస్తే 2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ అంశాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Grama Sachivalayam Rationalization
Grama Sachivalayam Rationalization

CM Instructions:

అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సూచించారు. వీరి ద్వారా ఎఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీ పరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చెయ్యాలని సూచించారు. కనీసం 2500 జనాభాకు లేదా 5 కి.మీ పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలని సిఎం సూచించారు. ఏజెన్సీలలో అవసరం అయితే అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు. గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్తవిధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు.

🔥4576 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు

Grama Sachivalayam Additional Staff:

కొత్త విధానం అమలు పరిస్తే 15 వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారు. వీళ్లలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారిని శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు. అదే విధంగా ప్రజల సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే పక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు రియల్‌టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని సిఎం సూచించారు. సచివాలయాల పనితీరు అంచనా వేసి వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శి/వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ విభాగానికి అధిపతిగా ఉంటారు.

Join WhatsApp Group

ఇటువంటి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.

2 thoughts on “Grama Sachivalayam Rationalization: గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది రేషనలైజేషన్”

Leave a Comment

error: Content is protected !!