Grama Sachivalayam Vacancies 2025:
గ్రామ వార్డు సచివాలయాలు త్వరలో రేషనలైజేషన్ చేయనున్నారు వాటికి సంబంధించి నిన్న అనగా 17 ఫిబ్రవరి 2025 GSWS శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు వివిధ గ్రామ వార్డు సచివాలయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే ఖాళీల వివరాలు ఎన్ని పోస్టులు కావాలి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని ఏం చేయనున్నారు వివరించడం జరిగింది.
ఇటువంటి గ్రామ సచివాలయం ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Grama Sachivalayam Vacancies:
ప్రస్తుతం ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల లో కేటగిరి A, B, C గా విభజించనున్నారు ఇందులో 2500 కంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయంలో 6 మంది 2500 నుండి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయంలో 7 మంది మరియు 3,500 కన్నా ఎక్కువ జనాభా ఉన్న సచివాలయంలో 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు పూర్తి వివరాలను మీరు కింద ఇచ్చిన పట్టికలో చూడవచ్చు.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
పై తెలిపిన విధంగా మల్టీపర్పస్ మరియు టెక్నికల్ సిబ్బందిగా వేరుచేసిన మిగిలిన సిబ్బందిని ఇతర శాఖలో మరియు ఇతర విభాగాలకు ఇవ్వనున్నారు ఈ విధంగా చేసిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో ఎన్ని పోస్టులు మంజూరు అయ్యాయి మరియు ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు కూడా ఇందులో భాగంగా వివరించడం జరిగింది ఖాళీల వివరాలు పరిశీలిస్తే.
- ANM- 1838
- విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ -130
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ -582
- వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ – 52
- వార్డ్ హెల్త్ సెక్రటరీ -397
- వార్డ్ అమినిటీస్ సెక్రటరీ – 438
- వార్డు శానిటేషన్ సెక్రెటరీ -210
Grama Sachivalayam Notification..?
పై తెలిపిన ఖాళీలను కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారా అని పరిశీలిస్తే ఈ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాదు వీటిని ఇతర సిబ్బంది ద్వారా భర్తీ చేస్తారు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయరని ప్రభుత్వం ఇచ్చిన PPT ద్వారా మనకు తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని క్రింది ఇచ్చిన PPT డౌన్లోడ్ చేసి మీరు కూడా చూడండి.
ఇటువంటి గ్రామ సచివాలయం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “గ్రామ వార్డు సచివాలయం ఖాళీలు | Grama Sachivalayam Vacancies 2025 | Grama Sachivalayam Latest Update”