ICDS Notification 2025:
అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి హెల్పర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది పూర్తి సమాచారం చూసుకోండి 14236 ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి అర్హతతో తెలంగాణలో అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఈ పోస్టులకు సంబంధించి వయస్సు జీతం వివరాలు ఎంపిక విధానం పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకోండి.
ఇటువంటి ICDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥కోర్టులో భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ ICDS ఉద్యోగ నోటిఫికేషన్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విడుదల చేయబోతున్నారు మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి 14,236 పోస్టులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో 6399 అంగన్వాడి కార్యకర్త మరియు 7387 అంగన్వాడి హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తారు సంబంధిత మంత్రి అయిన సీతక్క గారు దీనిపైన సంతకం చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు వివాహిత అయ్యి సొంత గ్రామానికి చెందిన వారు ఉంటే అదే గ్రామంలో ఖాళీలు ఉంటే ఉద్యోగం ఇస్తారు.
🔥ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఉండాలి ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 12,000/- వరకు లభిస్తుంది ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥TTD సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్:
- పదవ తరగతి సర్టిఫికెట్
- రెసిడెన్సీ ప్రూఫ్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్
- వివాహ ధ్రువీకరణ పత్రం
దరఖాస్తు విధానం:
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు అభ్యర్థులు ఆ సమయంలో ICDS కార్యాలయం సందర్శించి దరఖాస్తు చేయవచ్చు ప్రస్తుతం వచ్చిన అప్డేట్ సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ICDS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి.