IDBI Bank Jobs 2026:
IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మొత్తం 1300 పోస్టులు ఇందులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు తప్పనిసరిగా తెలుగు చదవడం మరియు మాట్లాడడం తెలిసి ఉంటే దరఖాస్తు చేయవచ్చు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం 19 మార్చ్ వరకు దరఖాస్తు చేయుటకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే తప్పకుండా ఆన్లైన్ మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయాలి.
ఇటువంటి IDBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10వ తరగతి అర్హత MTS ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి మరియు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి 8 మార్చ్ 2026 నుండి 19 మార్చి 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన IDBI వారు విడుదల చేశారు ఇందులో 1300 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 65 పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి తప్పకుండా తెలుగు మాట్లాడటం మరియు చదవడం తెలిసి ఉండాలి.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత పూర్తి చేసి ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 1050/- ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు 250 రూపాయలు చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత 12 ఏప్రిల్ 2026 ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేసే క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి IDBI బ్యాంకు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
