Ration News: ఆంధ్రప్రదేశ్ లో ఇంటి వద్దకు రేషన్ రద్దు.! రేషన్ బదులు డబ్బు ఇస్తారా..?
Ration Latest News:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేసిన వాహనాల ను ప్రభుత్వం రద్దు చేసింది రేపటి నెల నుండి రేషన్ సరుకులు రేషన్ దుకాణం వెళ్లి తీసుకోవాలి 65 సంవత్సరాలు దాటిన వారు మరియు దివ్యాంగులకు ఇంటి వద్ద ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అది ఎలా ఇస్తారు అనే సమాచారం ఇంకా తెలియజేయలేదు.
గత ప్రభుత్వంలో రేషన్ సరుకులను MDU ఆపరేటర్ ద్వారా ప్రభుత్వమే రాయితీపై వాహనాల నుంచి ఇంటివద్ద రేషన్ సరుకులు ఇచ్చేవారు ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా వాహనం వచ్చిన సమయంలో లబ్ధిదారులు లేకపోవడం అలాగే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం కొన్నిచోట్ల వాహనాలు లేకపోవడం కారణంగా ఇప్పటికే చాలా చోట్ల రేషన్ దుకాణాల వద్ద సరుకులు తీసుకుంటున్నారు.
🔥హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీ
Ration బదులు డబ్బు..?
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రేషన్ సరుకుల బదులు డబ్బు వారి బ్యాంకు ఖాతాకు బదలాయించే దానిపై చర్చించడం జరిగింది చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు వీటి పైన లోతుగా పరిశీలించి కొన్ని రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎటువంటి సమాచారం వచ్చిన మీకు వెంటనే తెలియజేస్తాము.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు తీసుకునే వారికి వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆప్షన్ తొలగించినట్లు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు ఇక నుండి వివాహ ధ్రువీకరణ పత్రం లేకుండా ఇతర పత్రాల ద్వారా కొత్తగా పెళ్లయిన వారు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇంకా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే సరి చేస్తారని అధికారులు తెలిపారు.
ఇటువంటి Ration సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.