SSC GD Jobs 2025:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో 25487 ఖాళీల జనరల్ డ్యూటీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ మరియు SSF కానిస్టేబుల్, అస్సాం రైఫిల్స్ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు ఈసారి భారీగా ఖాళీలు విడుదల చేసిన నేపథ్యంలో అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి చాలా రోజులకు మంచి అవకాశం ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది.
ఇటువంటి SSC GD ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి జిల్లా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 1 డిసెంబర్ 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధించి స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) వారు విడుదల చేశారు ఇందులో GD పోస్టులు అయిన BSF, CISF, ITBP, CRPF, SSB, SSF, AR మరియు జనరల్ డ్యూటీ ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం ఖాళీల వివరాలు 25,487 ఇందులో ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేసే ఉద్యోగాలు ఇవి.
విద్యార్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అదనపు అర్హత అవసరం లేదు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 23 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు నందు సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే పే స్కేల్ 21,700/- నుండి 69,100/- ఉంటుంది అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి 40 వేల వరకు జీతం రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు మహిళలకు కూడా ఎటువంటి ఫీజు లేకుండా ఆన్లైన్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
నియామక ప్రక్రియలో భాగంగా మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు తెలుగులోనే పరీక్ష రాసి మంచి అవకాశం కల్పిస్తున్నారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రింద ఇవ్వడం జరిగింది అధికారికంగా https://sss.gov.in ద్వారా మనం దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు క్రింద చూసి 31 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి SSC GD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
