Thalliki Vandanam 2.O:
తల్లికి వందనం రెండవ లిస్ట్ జాబితా విడుదల చేశారు, డబ్బులు కూడా 10 జూలై విడుదల చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది కావున అర్హులైన వారు మీ పేరు లిస్ట్ లో ఉందో లేదో చూడండి. ఎలా చూడాలి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామ మరియు వార్డు సచివాలయం లో అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా విడుదల కావడం జరిగింది. అర్హులైన వారికి ఈరోజు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎవరైనా ఒకటవ తరగతి మరియు ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు అనర్హులు అయితే అర్జీ సమర్పించే అవకాశం ఇచ్చారు.
ఇటువంటి Thalliki Vandanam పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥అన్నదాత సుఖీభవ పథకం తేది వచ్చేసింది
Thalliki Vandanam 2.O అప్డేట్:
తల్లికి వందనం అర్హుల జాబితా లో పేరు ఉంటేనే ఈరోజు డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది మొదటి జాబితాలో అనర్హులు అయిన వారు అర్జీ సమర్పించి ప్రస్తుతం అర్హులు అయిన వారికి కూడా ఈరోజు డబ్బులు జమ చేస్తారు ఈ వివరాలు అన్ని ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయం లో అందుబాటులో ఉంటాయి మీరు మీ వాట్సాప్ లో కూడా చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఎలా చూడాలో ఎప్పుడు తెలుసుకుందాం.
How To Check Thalliki Vandanam Status in WhatsApp..?
- తల్లికి వందనం పథకం అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా పరిశీలించడానికి మీరు మొదట వాట్సాప్ మన మిత్ర ద్వారా పరిశీలించుకోవచ్చు తల్లిదండ్రులు మొదట మీ వాట్సాప్ లో 9552300009 నెంబర్ సేవ్ చేసుకోండి.
- ఆ తరువాత ఈ నెంబర్ కు Hi అని మెసేజ్ చేయండి.
- చేసిన వెంటనే మీకు సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ రావడం జరుగుతుంది.
- ఇందులో మీరు విద్యా సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తరువాత వచ్చిన లిస్ట్ లో మీరు తల్లికి వందనం సేవలు ఎంచుకోవాలి.
- అక్కడ మీకు తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అది ఎంటర్ చేసిన వెంటనే మీకు వివరాలు మెసేజ్ రావడం జరుగుతుంది.
ఇటువంటి Thalliki Vandanam పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.