AP Endowment Department Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ (Endowment) నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు 30 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. జనవరి 5 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ దేవాదాయ శాఖ (Endowment) వారు విడుదల చేశారు ఇందులో 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు 30 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
🔥ఆంధ్రప్రదేశ్ లో 1289 పోస్టులు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే సివిల్, ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమా చేసి ఉన్నవారు అర్హులు పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ PDF చూడండి.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 60,000/- వరకు రావడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 28 డిసెంబర్ 2024 నుండి 5 జనవరి 2025 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్నవారు అప్లికేషన్ ఈ తేదీలలో సమర్పించండి.
🔥సొంత రాష్ట్రంలో రైల్వే శాఖలో భారీగా జాబ్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు సిలబస్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. 21 జనవరి 2025న రాత పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500/- DD చెల్లించాలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ పేరు మీద చెల్లించి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Endowment ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP దేవాదాయ శాఖ ఉద్యోగాలు భర్తీ | AP Endowment Department Jobs 2024 | AP Temple Jobs 2024”