Grama Sachivalayam భారీ శుభవార్త వచ్చింది | Grama Sachivalayam ASO Promotion GO Released 

Grama Sachivalayam ASO Promotion:

ఆంధ్రప్రదేశ్ లో Grama Sachivalayam సిబ్బందికి భారీ శుభవార్త రావడం జరిగింది ఏకంగా గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రమోషన్ రూపంలో ఇస్తున్నారు ఇటీవల గ్రామ సచివాలయ అధికారుల సంఘం కొంతమంది డిజిటల్ అసిస్టెంట్లను ప్లానింగ్ శాఖలో ప్రమోషన్ ఇవ్వాలని మరియు ప్లానింగ్ శాఖ యొక్క సాంకేతిక మరియు పర్యవేక్షణలో పని చేయాలని కోరింది. వీరికి సరైన జాబ్ ఛార్ట్ మరియు ప్రమోషన్ ఛానెల్ ఇవ్వాలని మరియు ప్రమోషన్ల భాగంగా డిజిటల్ అసిస్టెంట్లకు అవకాశాలు అందించాలని కోరడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించిన ప్రభుత్వం క్రింద తెలిపిన విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Grama Sachivalayam ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

🔥AP లో NHM ద్వారా ఉద్యోగాలు భర్తీ.

Digital Assistants Promotion:

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, విజయవాడ వారు డిజిటల్ అసిస్టెంట్ సేవలు స్వర్ణ ఆంధ్ర @ 2047 ప్రోగ్రామ్ కోసం ఉపయోగపడతాయని, వ్యవసాయం, పరిశ్రమ మరియు సేవలలో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIs) ద్వారా సెక్టోరియల్ కార్యకలాపాలను మానిటర్ చేయడం మరియు ప్రభుత్వం యొక్క జన్మభూమి వంటి ప్రధాన ప్రోగ్రామ్లు మరియు ఇతర గణాంక పనులను చేపట్టడంలో ఉపయోగపడతాయని తెలిపారు. వీటిలో వర్షపాతం మరియు ఋతు పరిస్థితుల సేకరణ మరియు సంకలనం, దిగుబడి గణాంకాలు, ప్రాంత గణాంకాలు, TRAS, AS 1.0 & 1.1 కింద ప్రాంత గణనపై నమూనా తనిఖీ, ధర గణాంకాలు, సామాజిక-ఆర్థిక సర్వే, పరిశ్రమ గణాంకాలు, వార్షిక పరిశ్రమ సర్వే (ASI), మాసిక పరిశ్రమ ఉత్పత్తి సూచిక (IIP), చిన్న నీటిపారుదల గణన, ఆర్థిక గణన, జనాభా గణన, కుల గణన, స్థానిక ప్రాంత ప్లానింగ్ కోసం గణాంకాలు (SLAP), ప్రాంతీయ ఖాతాల విశ్లేషణ, గ్రామ స్థాయిలో గణాంకాల హ్యాండ్ బుక్ వంటి పనులను చేపట్టడంలో ఉపయోగపడతాయని తెలిపారు.

🔥కరెంట్ ఆఫీసుల్లో 475 ఉద్యోగాలు భర్తీ

277 డిజిటల్ అసిస్టెంట్లను అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) ఖాళీ పోస్టులలో ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు, ఇందుకు సంబంధించిన సేవా సమస్యలు, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి, అర్హత, ఎంపిక ప్రక్రియ, పే స్కేల్, సేవా నియమాలు మొదలైన వాటిని పరిష్కరించిన తర్వాత ఈ ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది వీటి కోసం 7 మంది అధికారులతో కమిటీ కూడా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

పైన తెలిపిన విధంగా గ్రూప్ 2 ఉద్యోగాలు గ్రామ సచివాలయం సిబ్బందికి ప్రమోషన్ ఇస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని కొంత మంది నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు కూడా 100% నిరుద్యోగులతో భర్తీ చెయ్యరు దానికి 60:40 నియమం ఉంది 60 % డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 40% ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు కావున వీటి వల్ల నిరుద్యోగులకు ఎటువంటి సమస్యా లేదు.

🔥రైల్వేలో 1104 ఉద్యోగాలు భర్తీ

Grama Sachivalayam Promotions:

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయం సిబ్బందికి ఇచ్చిన ప్రమోషన్స్ వివరాలు పరిశీలిస్తే.

  • పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 వారికి గ్రేడ్ 4 గా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది.
  • అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగులకు అన్ని జిల్లాల్లో అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్ గా ప్రమోషన్స్ ఇచ్చారు.
  • వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగులకు అన్ని జిల్లాలో ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి చెయ్యడం జరిగింది.

Grama Sachivalayam ASO Promotion

Digital Assistant Promotion Go PDF:

Grama Sachivalayam డిజిటల్ అసిస్టెంట్ ప్రమోషన్ GO NO 20 విడుదల కావడం జరిగింది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.

Join WhatsApp Group 

Download GO PDF

ఇటువంటి గ్రామ సచివాలయం ఉద్యోగుల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Grama Sachivalayam భారీ శుభవార్త వచ్చింది | Grama Sachivalayam ASO Promotion GO Released ”

Leave a Comment

error: Content is protected !!