AP DSC 2025 అప్డేట్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు మెగా డీఎస్సీ పై కొన్ని కీలక సూచనలు విడుదల చేశారు విద్యా శాఖ డైరెక్టర్ AP DSC 2025 గురించి అభ్యర్థులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు విడుదల చేశారు వాటి వివరాలు పరిశీలిస్తే.
ఇటువంటి AP DSC 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యా శాఖ డైరెక్టర్ చెప్పిన వివరాలు:
పాఠశాల విద్య కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రారంభించడం జరిగింది. అభ్యర్థులు ఏదైనా సందేహాలు ఉంటే వాటికి సంబంధించిన పరిష్కారాలు అక్కడి నుండి ఇవ్వడం జరుగుతుంది వాటికోసం అఫీషియల్ వెబ్సైట్ నందు ఉన్న నంబర్లకు కాల్ చేయవచ్చు.
మెగా డీఎస్సీ 2025 దరఖాస్తు నింపే సందర్భంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా కీలక సూచనలు ఇవ్వడం జరిగింది వాటి వివరాలు చూసుకుంటే.
- వివాహిత మహిళా అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్ లో ఉన్న ఇంటి పేరునే దరఖాస్తులో నింపాలి.
- ఒకే అప్లికేషన్ లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఒకే పోస్టుకు ఒక జిల్లాలో లోకల్ మరొక జిల్లాలో నాన్ లోకల్ కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు అనగా ఒక పోస్ట్ కు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారం లో ఒకటి రెండు విభాగాలలో వివరాలు ఎన్ని సార్లు అయినా సవరణలు చేసుకోవచ్చు.
- ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు.
పై సూచనలు అన్ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు చేయవచ్చు అలాగే టెట్ మార్కుల వివరాలు వెబ్సైటులో అందుబాటులో ఉంచుతామని తెలపడం జరిగింది.
ఇటువంటి AP DSC 2025 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP DSC 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు విద్యా శాఖ కీలక సూచనలు చేసింది”