Assistant Jobs in NMDFC:
నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ (NMDFC) లో అసిస్టెంట్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(Assistant Jobs) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రతి నెల 25 వేల నుండి 45 వేల జీతం వచ్చే డిగ్రీ అర్హత ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NMDFC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఈ కార్డు ఉంటే చాలు చాలా ప్రయోజనాలు
Assistant Jobs Important Dates:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 3 మే 2025 నుండి 2 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హుల వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్(NMDFC) వారు విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్ ఏ భాగంలో డిగ్రీ అర్హత కలిగి టైపింగ్ చేయడం తెలిసినవారికి ఈ ఉద్యోగం ఇస్తారు చాలా మంచి అవకాశం వినియోగించుకోండి.
🔥AP లో 421 ఉద్యోగాల నోటిఫికేషన్
వయస్సు:
ఈ ఆర్థిక శాఖ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలలో సిలబస్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 600 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించి ఆన్లైన్ ద్వారా www.nmdfc.org వెబ్సైట్ లో దరఖాస్తు చేయవచ్చు.
ఇటువంటి NMDFC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Assistant Jobs: ఆర్థిక శాఖలో డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ ”