AP DSC 2025: ఏపీ డీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు, గడువు పెంచుతారా.?

AP DSC 2025:

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశించారు ఈ తరుణంలో చాలామంది విద్యార్థులు పరీక్షలకు 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు దానిని 90 రోజులకు పొడిగించాలని అడుగుతున్నారు ప్రభుత్వం పెంచే ఆలోచనలో ఉందా.? పూర్తి సమాచారాన్ని ఒకసారి చూద్దాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP DSC సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥AP మహిళా ఉద్యోగులకు శుభవార్త

AP DSC Exams 2025:

ఆంధ్రప్రదేశ్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఈ నెలకి ఒక సంవత్సరం పూర్తి అవ్వడం జరిగింది గత ఏడాది ఇదే నెలలో AP DSC నోటిఫికేషన్ కొరకు మొదటి సంతకం చేశారు ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ఒక సంవత్సరం ముందు విడుదల కావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాలు మరియు ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది మధ్యలో టెట్ పరీక్షలు నిర్వహించారు. చాలాసార్లు సీఎం గారు మరియు విద్యాశాఖ మంత్రి గారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మెగా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.

చెప్పిన విధంగానే మెగా డీఎస్సీ సంబంధించి పూర్తి షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం విడుదలైన షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు 45 రోజులు సమయం ఇచ్చారు చాలామంది నిరుద్యోగులు దీనిని 90 రోజులు కావాలని అధికారులను మరియు విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తులు చేస్తున్నారు ఈ తరుణంలో ఈ పరీక్షలు వాయిదా మరియు గడువు పొడిగించే అవకాశం ఉందా అని పరిశీలిస్తే.

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇప్పటికీ చాలా ఆలస్యం అయిన కారణంగా త్వరగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన ఒక నెల లోపు ఉపాధ్యాయులను నియమించాలని భావిస్తూ ఈ నోటిఫికేషన్ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేస్తోంది విద్యార్థులు ఇక 30 రోజుల సమయం మాత్రమే ఈ పరీక్షలకు ఉన్నందున ప్రిపేర్ అవ్వండి. చాలామంది సమయం పెంచాలని ఇప్పటికే 15 రోజులు వృధా చేసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం మరో 45 రోజులు సమయం పెంచిన మీరు వృధా చేసే సమయం తిరిగి రాదు కావున అభ్యర్థులు సమయం వృధా చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి.

🔥AP ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు

నిన్న జరిగిన విద్యాశాఖ సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఈ నోటిఫికేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే నారా లోకేష్ గారికి మెగా డీఎస్సీ పై వస్తున్న వినతులు సంగతి తెలిసిందే అయినా వాటిపైన ఎటువంటి స్పందన లేదు ప్రతి ఒక ట్విట్టర్ ట్రీట్ పై స్పందించే నారా లోకేష్ గారు మెగా డీఎస్సీ పై భారీగా వస్తున్న ట్వీట్ల పై ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు ఇక్కడే అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు గడువు పెంచే అవకాశం లేదు కావున ప్రిపేర్ అవ్వండి సమయం వృధా చేసుకోకండి ఇటువంటి మంచి అవకాశం చాలా రోజులకు రావడం జరిగింది.

AP DSC 2025

అభ్యర్థులు గమనిస్తే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా కోసం చాలామంది నిరుద్యోగులు రోడ్లపై వచ్చి నిరసన తెలిపిన ప్రభుత్వం అనుకున్న తేదీల ప్రకారమే పరీక్షలు నిర్వహించారు ఆ విధంగానే AP DSC పై కూడా నిర్ణయం ఉంటుంది. మేము ఎటువంటి కోచింగ్ సెంటర్ మరియు ఎటువంటి కోర్సులు అమ్మడం లేదు కావున ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను విశ్లేషించి మీకు చెప్పడం జరిగింది ఈ వివరాలు మీకు బాధను కలిగించవచ్చు కానీ నిజాయితీగా ఉన్న వివరాలను మీకు చెప్పడం జరిగింది గడువు పెంచితే అందరికీ సంతోషమే.

Join WhatsApp Group 

ఇటువంటి ఏపీ డీఎస్సీ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP DSC 2025: ఏపీ డీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు, గడువు పెంచుతారా.?”

Leave a Comment

error: Content is protected !!