AP Ration Cards Update:
ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న Ration Card సర్వీసులు ప్రారంభం అవ్వడం జరిగింది మొత్తం 7 రకాల సర్వీసులు ఇందులో ప్రారంభించారు అర్హులు మీ సచివాలయం సందర్శించి మీకు కావాల్సిన సేవను పొందవచ్చు అలాగే త్వరలోనే వాట్సప్ మిత్ర లో కూడా ఈ సేవలో ప్రారంభిస్తారు అసలు ఏ సేవలు ప్రారంభమయ్యాయి వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి రేషన్ కార్డు సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు
AP Ration Card Services:
7 రకాల రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభమయ్యాయి వాటి వివరాలు చూసుకుంటే
- కొత్త బియ్యం కార్డు
- కార్డులో వ్యక్తులను జోడించడం
- బియ్యం కార్డు విభజన
- బియ్యం కార్డు వ్యక్తిని తొలగించడం
- ఆధార్ సీడింగ్ కరెక్షన్
- చిరునామా మార్పు
- రైస్ కార్డ్ సరెండర్
పైన తెలిపిన సేవలను క్రింద తెలిపిన విధంగా మీరు పొందవచ్చు.
రైస్ కార్డు పొందుటకు అర్హతలు :
1.కొత్త బియ్యం కార్డు :బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయ్యి ప్రజా సాధికారత సర్వే అనగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా ఉండవలెను. ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయ్యి వుంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయ్యి ఉండాలి.
*ముఖ్య* *గమనిక* :
ఇప్పటి వరకు ఎవరికీ అయితే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ గారి బియ్యం కార్డు లో కానీ అత్త గారి కార్డు లో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును.
2. బియ్యం కార్డు లో వ్యక్తులను జోడించడం : చిన్న పిల్లలను యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, పెళ్లి అయిన వధువు ను జోడించడానికి వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు లో వారి యొక్క భర్త పేరు వున్నచో దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగును. ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ సొంత గ్రామం అయ్యి ఉండాలి.
3. బియ్యం కార్డు విభజన :బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజా సాధికారత సర్వే లో సెపరేట్(Household Mapping) గా ఉండవలెను. లేనిచో విభజించడానికి కుదరదు.
4. బియ్యం కార్డు లో వ్యక్తిని తొలగించుట :చనిపోయిన వ్యక్తిని మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగును.
అలా కాకుండా చాలా మంది మా అబ్బాయి అమెరికా లో వున్నాడు తను సంపాదించేది మాకు పెడతాడా కార్డు లో నుంచి తీసేయండి ప్రజా సాధికారత సర్వే లో నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు అలాంటివారికి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇచ్చినపుడు మాత్రమే చేయటం జరుగును గమనించగలరు.
5. ఆధార్ సీడింగ్ కరెక్షన్: తప్పుగా వున్నా ఆధార్ నీ అలా వదిలేసి కొత్త ఆధార్ తో ముందుగా ప్రజా సాధికారత సర్వే లో యాడ్ అయిన తరువాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలము. గమనించగలరు
6. చిరునామా మార్పు: ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా గా ఆ సచివాలయం అడ్రస్ ఉండవలెను మరియు కుటుంబ పెద్ద వేలి ముద్రతో మాత్రమే మనం ఇది చేయగలము గమనించగలరు.
7. సరెండర్ రైస్ కార్డు: బియ్యం కార్డు వద్దు అనుకున్న వారు వారి యొక్క బియ్యం కార్డు ను సరెండర్ చేసుకోవచ్చును.
How to Apply for an AP Ration Card..?
రేషన్ కార్డు సర్వీసులు పొందడానికి మీ ప్రాంతంలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి మీకు కావాల్సిన సేవకు సంబంధించి పత్రాలు సమర్పించిన తర్వాత ఈ సేవకు రుసుము 24 రూపాయలు చెల్లించాలి విభజన చేయుటకు మాత్రం ఫీజు 48 రూపాయలు ఈ విధంగా మీకు కావాల్సిన సర్వీసులు పొందవచ్చు త్వరలో వాట్సాప్ మిత్ర లో కూడా రేషన్ కార్డు సర్వీసులు తీసుకురానున్నారు.
How to check Ration Card status.?
మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు T నంబర్ ఒకటి రావడం జరుగుతుంది దానిని క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీ రేషన్ కార్డు సర్వీసు యొక్క స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అది ఎక్కడ పెండింగ్ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
ఇటువంటి రేషన్ కార్డు సంబంధించిన సమాచారం రోజు పొందటానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “Ration Card: ఆంధ్రప్రదేశ్ లో 7 రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభం అయ్యాయి ”