IDBI Bank Jobs 2025:
ఐడిబిఐ బ్యాంకు నుండి 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ స్కిల్స్ తెలిసినవారికి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం తెలియజేయడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి IDBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 8 మే నుండి 20 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ IDBI వారు విడుదల చేశారు ఇందులో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
🔥AP జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు
విద్యా అర్హత:
ఈ ఐడిబిఐ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ స్కిల్స్ ఉంటే చాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు 250 రూపాయలు ఫీజు మిగిలిన అందరూ అభ్యర్థులు 1050 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి IDBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.