AP Super Six Good News:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలియజేసింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు విడుదలకు సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాలని నిర్ణయించింది దానికి అనుగుణంగా ఏ పథకాలు ఏ తేదీన విడుదల చేయాలో పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Thalliki Vandanam Update:
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 చొప్పున వేసే పథకం తల్లికి వందనం ఈ పథకాన్ని పాఠశాలలు ప్రారంభం అయ్యే తేదీ జూన్ 12 న విడుదల చేయాలని AP ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Annadata Sukhibhava Update:
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 వ తేదీ విడుదల చేస్తున్నట్లు టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్వహించారు ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసే క్రమంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో 6000/- ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో 14,000/- చెల్లిస్తారు మొత్తంగా రైతులకు 20,000 లబ్ది ఉంటుంది.
ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు:
మహిళలకు పూజిత బస్సు ప్రయాణం పథకాన్ని మరో రెండు నెలల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చం నాయుడు గారు వెల్లడించారు ఈ పథకం ప్రారంభం గురించి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు ఈ పథకం అమలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతినెల 70 కోట్లు వరకు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
🔥తల్లికి వందనం విడుదల తేదీ వచ్చేసింది
లక్ష మంది వితంతువులకు పెన్షన్లు:
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం స్పౌజ్ పెన్షన్ లో భాగంగా వితంతువులకు పెన్షన్ జారీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో భాగంగా ఇవ్వనున్నారు అలాగే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒంటరి మహిళలకు కూడా ఇందులో అవకాశం కల్పించనున్నారు మీ పథకాన్ని కూడా జూన్ 12వ తేదీ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీపం పథకం గుడ్ న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీపం పథకం గత దీపావళి నుంచి అమలు చేసిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ప్రజలకు మరో శుభవార్త తెలియజేసింది 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ పథకంలో సిలిండర్లు తీసుకోకపోయినా మూడు సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చం నాయుడు తెలియజేశారు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది ఇక మీద ఏ సమాచారం ఆంధ్రప్రదేశ్ పథకాల గురించి వచ్చిన మన వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. రోజు మన వెబ్సైట్ సందర్శించండి.