Thalliki Vandanam Update:
తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులు కూటమి ప్రభుత్వం 12 జూన్ 2025 విడుదల చేయనున్నారు ఈ డబ్బు మీ ఖాతాలో పడాలంటే ఏం చేయాలి అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తల్లులందరూ మీ పిల్లలను 75% పాఠశాలకు హాజరు అయ్యేవిధంగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు మీ పథకానికి అర్హులు అవుతారు. అర్హులు అయిన తర్వాత మీ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి దీనినే NPCI లింక్ అంటారు. మీరు పాఠశాలలో ఏ బ్యాంకు ఖాతా ఇచ్చిన ఆ ఖాతాకు డబ్బులు జమ చేయరు కేవలం తల్లుల ఆధార్ నెంబర్ కు ఏ బ్యాంకు అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంకుకు మాత్రమే డబ్బులు జమ చేస్తారు.
🔥ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల తేదీ
కావున తల్లులు అందరూ ముందుగా మీ బ్యాంకు ఖాతా NPCI లింక్ ఉందా లేదా పరిశీలించుకోవాలి ఇది పరిశీలించుకోవడానికి మీరు మీ బ్యాంకు వెళ్లి అక్కడ మీ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ పాస్ బుక్ వారికి ఇస్తే వారు పరిశీలించి మీకు తెలియజేస్తారు. ఒకవేళ మీ బ్యాంకుకు ఆధార్ కార్డు లింక్ లేకపోతే వారే లింక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉంటే మీకు నేరుగా డబ్బులు రావడం జరుగుతుంది. ఇంకా ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మీకు దీపం పథకం లో భాగంగా డబ్బులు బ్యాంకు ఖాతాకు జమ అయ్యి ఉంటే మీ బ్యాంకు ఆధార్ తో అనుసంధానం అయి ఉంటుందని అనుకోవచ్చు.
దీపం పథకం ఒకటే కాకుండా ఇతర ఏ పథకాలు అయినా నేరుగా మీ బ్యాంకు ఖాతాకు జమ అయ్యి ఉంటే మీ బ్యాంకు ఖాతా NPCI లింక్ ఉన్నట్టు అనుకోవచ్చు అప్పుడు మీకు Thalliki Vandanam సొమ్ము కూడా నేరుగా మీ బ్యాంకు ఖాతాలో రావడం జరుగుతుంది. అలాగే ఒకవేళ డబ్బులు జమ కాలేదు బ్యాంకుకు ఆధార్ అనుసంధానం అయింది పిల్లలు కూడా 75% పాఠశాలకు హాజరు అయ్యారు అయిన ఎందుకు మాకు డబ్బులు జమకాలేదు అంటే వీటికి వివిధ కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
🔥భారీగా రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు
Thalliki Vandanam Eligibility:
- మీకు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి అప్పుడే మీరు అర్హులు అవుతారు.
- నాలుగు చక్రాల కారు ఉండకూడదు.
- కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉండరాదు.
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఉండరాదు.
- కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు ఉండరాదు.
- పట్టణాల్లో ఇల్లు 1000 Square Feet కన్నా ఎక్కువ ఉండరాదు.
పై విధమైన కారణాలవల్ల మీరు అనర్హులు అయితే మీకు Thalliki Vandanam డబ్బులు రావు అర్హులు అయిన వారి లిస్ట్ పాఠశాలలకు మరియు మీ గ్రామ, వార్డు సచివాలయానికి కూడా రావడం జరుగుతుంది అక్కడ మీరు పరిశీలించుకోవచ్చు.
ఇటువంటి తల్లికి వందనం పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.