Ration Card Latest News:
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకులు డీలర్ల ద్వారా జూన్ 1 నుండి ఇవ్వడం ప్రారంభించారు అయితే చాలామంది రేషన్ బదులు డబ్బులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అయితే వారికి బ్యాడ్ న్యూస్ ఎందుకంటే మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది ఎందుకు రద్దు అవుతుంది పూర్తి వివరాలు పరిశీలిద్దాం. తాజాగా ఏపీ అసెంబ్లీ పిటిషన్ల కమిటీ సమావేశం నిర్వహించారు ఇందులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మరియు అందులోని సభ్యులు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా బియ్యం వద్దనుకునే వారికి రేషన్ కార్డు అవసరం లేదని వారు వెనక్కి ఇచ్చేయాలని సూచించడం జరిగింది.
Ration Card కు ఆరోగ్య శ్రీ కార్డుకు ఎలాంటి సంబంధం ఉండకూడదు అలా చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టవచ్చు అని అభిప్రాయపడ్డారు. బియ్యం అవసరం లేని వారు రేషన్ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ అవసరాల కోసం రేషన్ కార్డు తీసుకుని బియ్యం అమ్ముకుంటున్నారని ఫిర్యాదు పై కమిటీ చర్చించింది ఇందులో ప్రభుత్వానికి ముఖ్యంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది.
రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ సంబంధం ఉండడంతో చాలామంది కార్డు తీసుకొని బియ్యం అమ్ముకుంటున్నారని రెండిటిని విడగొడితే ఈ ఇబ్బంది ఉండదని అధికారులకు చెప్పారు ఇదే విషయాన్ని కమిటీ చర్చించింది స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాం రాష్ట్రంలో 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.49 కుటుంబాలకు రేషన్ కార్డు ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోగా రాష్ట్ర ప్రభుత్వానికి 5100 కోట్లు దీనికోసం ఖర్చు పెడుతున్నారు బియ్యం తిననివారు రేషన్ కార్డు తిరిగి ఇస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గి ఆ డబ్బులు విద్య శాఖ పై ఖర్చుపెట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు.
కావున దీనిబట్టి మనం పరిశీలిస్తే ఎవరు కూడా రేషన్ సరుకులు తీసుకోకుండా ఉండకండి. రేషన్ బదులు డబ్బు కావాలని ఏ సర్వేలో కూడా చెప్పకండి మీకు రేషన్ సరుకులు వద్దు అనుకుంటే స్వచ్ఛందంగా Ration Card గ్రామ మరియు వార్డు సచివాలయాలను వాటిని సమర్పించవచ్చు. ఆరు నెలలు రేషన్ సరుకులు తీసుకొని వారి కార్డులు కూడా త్వరలో రద్దు అయ్యే అవకాశం.
ఇటువంటి Ration Card సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Ration Card: ఏపీ లో రేషన్ సరుకులు వద్దు, డబ్బులు తీసుకోవాలి అనుకుంటున్నారా.? అయితే మీకు బ్యాడ్ న్యూస్”