Asha Worker Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలో గ్రామ మరియు వార్డు సచివాలయం పరిధిలో Asha వర్కర్ ఖాళీలలో భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తం 1294 పోస్టులు ఇందులో ఉన్నాయి కేవలం పదవ తరగతి అర్హత ఉండి తెలుగు చదవడం రాయడం వచ్చిన వారికి ఈ పోస్టులు అవకాశం కల్పిస్తారు కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. వయస్సు 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Asha వర్కర్ పోస్టుల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
ఆశ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 18 జూన్ 2025 నుండి 30 జూన్ 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో 1294 ఆశా వర్కర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు & జీతం:
ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే వయస్సు కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి. మీరు ఈ పోస్టుకు ఎంపిక అయితే జీతం 11500 చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
విద్యా అర్హత:
ఆశ వర్కర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కేవలం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి మహిళా అభ్యర్థి అయి ఉండాలి. సొంత గ్రామంలో నివసిస్తున్న వారికి అక్కడ ఖాళీలు ఉంటే అవకాశం కల్పిస్తారు తెలుగు మాట్లాడడం చదవడం తెలిసి ఉండాలి. దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు కావాల్సిన పత్రాలు:
Asha వర్కర్ పోస్టుకు మీరు దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన అన్ని పత్రాలు అప్లికేషన్ ఫారం తో పాటు సమర్పించాలి.
- పదవ తరగతి మార్క్స్ మెమో
- ఆధార్ కార్డు
- నివాస ధ్రువీకరణ పత్రం
- వివాహం అయిన వారు మ్యారేజ్ సర్టిఫికెట్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- భర్త మరణించిన వారు డెత్ సర్టిఫికెట్
దరఖాస్తు చేయడానికి ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి. జిల్లాల వారీగా నోటిఫికేషన్ కొరకు జిల్లా వెబ్సైటు తనిఖీ చేయండి.
ఇటువంటి Asha వర్కర్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Asha Worker Jobs: 10th అర్హత తో సచివాలయంలో 1294 ఆశ వర్కర్ నియామకాలు”