RRB Technician Recruitment 2025:
భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) సంస్థ నుండి టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో టెక్నీషియన్ వివిధ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 6238 పోస్టులు భర్తీ చేస్తారు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు వయస్సు సడలింపు కూడా ఉంటుంది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB టెక్నీషియన్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 28 జూన్ 2025 నుండి 28 జూలై 2025 వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు విడుదల చేశారు ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183 టెక్నీషియన్ గ్రేడ్-3 6055 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇవి శాశ్వత ఉద్యోగాలు కావున ఎవరు వదలకుండా దరఖాస్తు చేయండి.
వయస్సు & జీతం:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది. మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే ప్రారంభ జీతం 45000 ఉంటుంది ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥TTD లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
విద్యా అర్హత:
- టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు.
- టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు లేదా డిప్లమా ఉత్తీర్ణత సాధించిన వారు లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారికి స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి OC, OBC అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టి మరియు దివ్యాంగులు 250 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు పరీక్ష రాసిన వారికి ఫీజు రీఫండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింకు క్రింది ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి. ప్రస్తుతం షార్ట్ నోటీసు విడుదల కావడం జరిగింది.
ఇటువంటి RRB టెక్నీషియన్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.