APPSC Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇప్పటికే జిల్లా కోర్టు మరియు ఏపీపీఎస్సీ వారు అటవీశాఖ ఉద్యోగాలు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే మరో వారం రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వాటికి సంబంధించి రోస్టర్ పాయింట్లు ఏపీపీఎస్సీ వారికి చేరిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం విడుదల చేయబోయే ఉద్యోగ వివరాల సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
🔥ఏపీ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
APPSC Notifications Update:
మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అటవీశాఖ సంబంధించి సెక్షన్ ఆఫీసర్ 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇవే కాకుండా ఇతర శాఖల్లో 75 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని APPSC వారు ప్రకటించారు విడుదల చేసే నోటిఫికేషన్ శాఖల వారీగా పోస్టుల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 11 ఉన్నాయి. భూగర్భ నీటిపారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు, మత్స్య శాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మూడు పోస్టులు, హార్టికల్చర్ ఆఫీసర్ రెండు పోస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్ 10 పోస్టులు, దేవాదాయ శాఖలో ఏడు పోస్టులు, జిల్లా సైనిక అధికారి ఏడు పోస్టులు, గ్రంథాలయ శాఖలో రెండు పోస్టులు, మరియు ఇతర శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
ఒకే విద్యా అర్హత ఉండే పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు ఏ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది వీటికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ లో త్వరలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది కావున నిరుద్యోగులు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 691 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “APPSC Jobs Notification 2025 | AP Jobs 2025”